Share News

సుప్రీంకోర్టు కొలీజియంపై మాజీ సీజేఐ బి.ఆర్. గవాయ్ అసంతృప్తి.. రాష్ట్రపతి ముర్ముకు లేఖ

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:29 PM

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సుల్లో జోక్యం చేసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు కొలీజియంపై మాజీ సీజేఐ బి.ఆర్. గవాయ్ అసంతృప్తి.. రాష్ట్రపతి ముర్ముకు లేఖ
Justice BR Gavai letter To President Of India Droupadi Murmu

ఢిల్లీ,నవంబర్ 27: సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సుల్లో జోక్యం చేసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల సిఫార్సుల్లో జోక్యం చేసుకోవాలని ఆమెను కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రపతి ముర్ముకు మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ మూడు పేజీల లేఖ రాశారు. ప్రతిభ, వైవిధ్యాన్ని పక్కనపెట్టి ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు.


దేశ జనాభాలో 5 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న వర్గానికి సుప్రీంకోర్టులో 40 శాతానికిపైగా ప్రాతినిధ్యం వహిస్తుందని సోదాహరణగా ఆ లేఖలో మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణాలకూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షాత్మక బదిలీల (Punitive Transfers)కు గురైన జడ్జీలకు ప్రముఖ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లుగా పదోన్నతులు కల్పిస్తున్నారని విమర్శించారు.


కొలీజియం సిఫార్సులకు జవాబుదారీతనం ఉండాలని మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ అభిప్రాయపడ్డారు. తన రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు ఆయన ఈ లేఖలో విన్నవించారు. ఈ లేఖ ప్రతులను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌లకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పంపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్‌ నలుగురు డైరెక్టర్ల అరెస్ట్

జగిత్యాలలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

For More TG News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 04:06 PM