Share News

అక్రమ అండాల విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్‌ నలుగురు డైరెక్టర్ల అరెస్ట్

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:59 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ అండాల విక్రయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

అక్రమ అండాల విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్‌ నలుగురు డైరెక్టర్ల అరెస్ట్
Men Arrested in

హైదరాబాద్, నవంబర్27: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ అండాల విక్రయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా సద్గురు హెల్త్‌కేర్ సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. హరి ప్రసాద్, దుర్గాప్రసాద్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేటలోని సెంటర్ పాయింట్ అపార్ట్‌మెంట్‌లో పోలీసుల విస్తృత సోదాలు నిర్వహించారు. ఏడో అంతస్తులోని సద్గురు హెల్త్‌కేర్, ఓయాసిస్ కార్పొరేట్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు.


ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు ఈ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ అండాల విక్రయానికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లతోపాటు ఆధారాలు స్వాధీనం చేసుకుని.. వాటిని సీజ్ చేశారు. అలాగే కార్యాలయ సిబ్బంది స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు రికార్డు చేశారు. అనంతరం సద్గురు హెల్త్‌కేర్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఇక సద్గురు ఫౌండర్ డైరెక్టర్ కిరణ్ గేదెల కోసం గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు.


కిరణ్ గేదెల పరారీలో ఉన్నారు. అతడు ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్ గేదెలపై నాన్ బెయిలబుల్ వారెంట్ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ అండాల విక్రయం వ్యవహారంలో కిరణ్ గేదెల కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఓయాసిస్ ఫెర్టిలిటీ నుంచి సద్గురు హెల్త్‌కేర్‌కు కోట్లాది రూపాయల బదిలీ జరిగినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ అండాల విక్రయం వెనుక మరింత మంది ఉన్నారు? అని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగిత్యాలలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:15 PM