జగిత్యాలలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:29 PM
స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
జగిత్యాల, నవంబర్ 27: స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థిని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో సహచర విద్యార్థినులు వెంటనే స్పందించి.. కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అయితే తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది.
ఈ వేధింపులపై ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారికి ఫిర్యాదు చేయడంతో.. తనను మరింత వేధింపులకు గురి చేశారని పేర్కొంది. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా వేధించారని వెల్లడించింది. అయితే ఈ ఘటన బయటకు రాకుండా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఒత్తిడి చేశారంటూ నర్సింగ్ కళాశాల యాజమాన్యంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కళాశాల యాజమాన్యాన్ని నర్సింగ్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
విధి నిర్వహణలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి.. హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి