మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:32 PM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. పుతిన్ ప్రభుత్వం రక్షణ రంగానికి ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఎన్నడూ లేనంత భారీ రక్షణ బడ్జెట్‌కు రష్యా పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. పుతిన్ ప్రభుత్వం రక్షణ రంగానికి ఇంత భారీ బడ్జెట్ కేటాయించడం ఆసక్తికరంగా మారింది. 2027 నుంచి 2029 వరకు మూడేళ్ల కాలానికి ఏకంగా 609 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55 లక్షల కోట్లు) డిఫెన్స్ బడ్జెట్‌ను కేటాయించింది (Russia Defence Budget).
రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డ్యూమా నవంబరు 24న 2027-29 బడ్జెట్‌కు మూడో, తుది ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ ప్రకారం 2027లో రక్షణ రంగానికి 17.15 లక్షల కోట్ల రూబుళ్లు కేటాయించనున్నారు. 2026లో కేటాయించిన 12.93 లక్షల కోట్ల రూబుళ్లతో పోలిస్తే ఇది దాదాపు 33 శాతం అధికం. ఇక, 2028లో 16.61 లక్షల కోట్ల రూబుళ్లు, 2029లో 16.30 లక్షల కోట్ల రూబుళ్లు రక్షణ రంగానికి ఖర్చు చేయాలని రష్యా ప్రణాళిక రూపొందించింది. ఈ మూడేళ్లలో మొత్తం సైనిక వ్యయం 50 లక్షల కోట్ల రూబుళ్లను దాటనుంది (Russian Military Spending).
2027లో రష్యా మొత్తం ప్రభుత్వ వ్యయం 48.74 లక్షల కోట్ల రూబుళ్లుగా అంచనా వేశారు (Russia Ukraine War). ఇందులో రక్షణ రంగానికే 35.2 శాతం నిధులు కేటాయించనున్నారు. అంటే దేశం ఖర్చు చేసే ప్రతి మూడు రూబుళ్లలో ఒకటి కంటే ఎక్కువ మొత్తం సైనిక అవసరాలకే వెళ్తుంది. రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్న రష్యా.. మరోవైపు కొన్ని పౌర సంక్షేమ రంగాల ఖర్చులను తగ్గిస్తోంది. 2026తో పోలిస్తే జాతీయ ఆర్థిక రంగానికి కేటాయింపులు 3 శాతం, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఖర్చులు 8 శాతం తగ్గనున్నాయి. ఆరోగ్య రంగానికి కేటాయింపులు 3 శాతం, సామాజిక సంక్షేమానికి సంబంధించిన నిధులు 6 శాతం తగ్గనున్నాయి.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్