ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:41 PM
ఐపీఎల్ 2027 మినీ వేలానికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ పేరు నమోదు చేసుకున్నాడు. కనీస ధర రూ.30 లక్షల ఆర్యవీర్ వేలంలోకి రానున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ పేరు నమోదు చేసుకున్నాడు. అతడితో పాటు అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మరో యువ ప్లేయర్ మోహిత్ ఉల్వా కూడా ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆర్యవీర్ సెహ్వాగ్, మోహిత్ ఉల్వా ఇద్దరూ రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇటీవల ముగిసిన అండర్ 19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ 16న గోవా వేదికా ఐపీఎల్ 2027 వేలం జరగనుంది.
భారత అండర్-19 జట్టు కెప్టెన్ లక్ష్య రైచందాని కూడా ఈసారి ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ సైతం వేలం నుంచి తప్పుకున్నాడు. అండర్-19 ఆసియా కప్ విజేత జట్టులో సభ్యుడైన పేసర్ కావ్య పటేల్ పేరు కూడా వేలంలో ఉండే అవకాశం ఉంది.
వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు!
ఐపీఎల్-2027 వేలానికి సంబంధించిన ప్రాథమిక జాబితాలో మొత్తం 1,220 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. డిసెంబర్ 1 నాటికి ఈ జాబితాను కుదించనున్నారు. ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్ల పేర్లతో పాటు అదనంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన క్రికెటర్ల వివరాలను కూడా సమర్పించనున్నాయి. ఈ జాబితాలో 14 మంది క్యాప్‌డ్ భారత ఆటగాళ్లు ఉన్నారు. ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్‌తో పాటు ఆకాశ్ దీప్, జయదేవ్ ఉనద్కత్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కుల్దీప్ సేన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సారంగ్ జైన్, శివమ్ మావి, తుషార్ దేశ్‌పాండే, ఉమేశ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ ఈ జాబితాలో ఉన్నారు. ఆసక్తికరంగా ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్ మాత్రమే స్టోక్స్‌తో పాటు రూ.2 కోట్ల కనీస ధర విభాగంలో ఉన్న భారత ఆటగాళ్లుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!