వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:51 PM
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత కుర్రాడు వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీతో అలరించాడు. ఈ క్రమంలో వైభవ్ విషయంలో మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంకు పలు సూచనలు చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత కుర్రాడు వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీతో అలరించాడు. మనం చూస్తుందని వన్డేనా, లేకా టీ20 మ్యాచా అని క్రికెట్ ప్రియులు అనుకునేలా అతడి బ్యాటింగ్ ఉంది. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకోవడమే కాకుండా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో వైభవ్ విషయంలో మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంకు పలు సూచనలు చేశారు. వైభవ్‌ను మున్ముందు అన్ని ఫార్మాట్లలోనూ ఆడించాలని, సింగిల్ హ్యాండ్‌తో మ్యాచులను గెలిపించే సత్తా అతడికి ఉందని వెల్లడించారు.
తన యూట్యూబ్ ఛానల్‌లో క్రిష్ మాట్లాడుతూ.. ‘వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshai) తనంతట తానుగా మ్యాచులు గెలిపించగల ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడిని ఇప్పటికిప్పుడు టెస్టుల్లో ఆడించకూడదనుకుంటే సరే కానీ.. కనీసం ఎంపిక చేసే 15 మందిలో అవకాశం కల్పించాలి. తర్వలో శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఇందులో వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలి. జట్టులోకి తీసుకుని, ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడించండి. వైభవ్‌ను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని మీరు భావిస్తే మాత్రం.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయాలి. అతడిని 15 మంది స్క్వాడ్‌లో తప్పనిసరిగా ఉంచాలి. ఏదొక రోజు అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపిస్తాడు’ అంటూ వైభవ్ పై శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ యువ సంచలనాన్ని సచిన్ టెండూల్కర్ , విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలతో పోల్చడమే కాకుండా, అతడిని సన్ ఆఫ్ గాండ్ ఆఫ్ క్రికెట్ అని కూడా శ్రీకాంత్ అభివర్ణించారు. ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను చూస్తే.. కేవలం పవర్ మాత్రమే కాదు, టైమింగ్‌తో కూడిన ఆట ఉంది. షాట్ల ఎంపిక విషయంలో ఏమాత్రం అసంతృప్తి చెందినట్లు కనిపించడు. ఏం చేయాలి? ఎలా చేయాలనే విషయాలపై ఈ 15 ఏళ్ల కుర్రాడికి స్పష్టత ఉంది. ముందు ‘గాడ్ ఆఫ్ ది క్రికెట్’ సచిన్ వచ్చాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీ.. తాజాగా వైభవ్ ‘సన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ది క్రికెట్’ టీమిండియాకు లభించాడు. ఇలాంటి అద్భుతమైన ప్రతిభ ఉన్న ప్లేయర్‌ను ప్రోత్సహించకుండా.. అతడే వృద్ధిలోకి వస్తాడని చెప్పడం అన్యాయం అవుతుంది. ఇలాంటి ప్రవర్తనతో ఓ నాణ్యమైన క్రికెటర్ భవిష్యత్తును నాశనం చేయొద్దు. టీమిండియా మేనెట్మెంట్, అలానే సెలక్టర్లు దయచేసి మేల్కొనాలి’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: