Share News

బుమ్రా చెత్త రికార్డు.. 38 ఓవర్లు వేసినా వికెట్ నిల్!

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:00 PM

క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.

బుమ్రా చెత్త రికార్డు.. 38 ఓవర్లు వేసినా వికెట్ నిల్!
Jasprit Bumrah

స్పోర్ట్స్ డెస్క్: క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ (53) అజేయ అర్థశతకం సాధించగా, గ్లెన్ ఫిలిప్స్ (36) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ టామ్ లాథమ్ (59) అర్థసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్‌, వాషిం‍గ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.


2021 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో వికెట్ తీయకుండా ఎక్కువ ఓవర్లు వేయడం ఇదే కావడం గమనార్హం. ఆనాటి డబ్ల్యూటీసీ ఫైనల్లో బుమ్రా 36 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకు 38 ఓవర్లు వేసి కనీసం ఒక వికెట్ తీయకుండా ఆ చెత్త రికార్డును అధిగమించాడు. వెల్టింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన బుమ్రా ఆ తర్వాత 19 ఓవర్లలో మరో వికెట్ పడగొట్టలేకపోయాడు.తొలి సెషన్‌లో ఓపెనర్ల దూకుడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలి సెషన్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కాన్వే, టామ్ లాథమ్ కలిసి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే గుర్నూర్ బ్రార్ కాన్వేను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. రెండో సెషన్‌లో మాత్రం భారత బౌలర్లు విజృంభించారు. టీ విరామం అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు జోరును ప్రదర్శించారు. డారిల్ మిచెల్ (31) ఔటైనప్పటికీ, టామ్ బ్లండెల్ అజేయ అర్ధ శతకంతో పాటు ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ కూడా ధాటిగా ఆడాడు. దీంతో కివీస్ 5 వికెట్ల నష్టానికి 246 పరుగులతో తొలి రోజు ఆటను ముగించింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట.. కివీస్ స్కోర్ 246/5

యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్

Updated Date - Nov 27 , 2026 | 03:07 PM