భారత్‌తో రెండో టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట.. కివీస్ స్కోర్ 246/5
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:18 AM
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో కివీస్ 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో కివీస్ 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. క్రీజులో టామ్ బ్లండెల్(53*), గ్లెన్ ఫిలిప్స్(36*) కొనసాగుతున్నారు. ఓపెనర్ టామ్ లాథమ్(59) హాఫ్ సెంచరీ చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాన్వే(31), నికోల్స్(16), డారిల్ మిచెల్(31) పర్వాలేదనిపించారు. రచిన్ రవీంద్ర(0) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, వాషింగ్టన్ సుందర్ తలొక వికెట్ చొప్పున పడగొట్టారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఒక్క వికెట్ కూడా పడకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్