Share News

భారత్‌తో రెండో టెస్టు: ఆకాశ్‌ దీప్ ‘ఫైఫర్’.. 356 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:55 AM

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు రెండో రోజు ఆట జరుగుతుంది. న్యూజిలాండ్ 356 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత్‌తో రెండో టెస్టు: ఆకాశ్‌ దీప్ ‘ఫైఫర్’.. 356 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
India vs New Zealand 2nd Test

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు రెండో రోజు ఆట జరుగుతుంది. న్యూజిలాండ్ 356 పరుగులకు ఆలౌట్ అయింది. టామ్ లాథమ్(59), టామ్ బ్లండెల్(89) హాఫ్ సెంచరీలు చేశారు. డెవాన్ కాన్వే(31), హెన్రీ నికోల్స్(16), డారిల్ మిచెల్(31), ఫిలిప్స్(36), నాథన్ స్మిత్(26), జెమీసన్(19), మ్యాట్ హెన్రీ(19) పరుగులు చేశారు. రచిన్ రవీంద్ర(0) విఫలమయ్యాడు. డఫీ(2*) నాటౌట్‌గా నిలిచాడు.


భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 5 వికెట్లతో చెలరేగాడు. అన్షుల్ కాంబోజ్ 2, గుర్నూర్ బ్రార్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. కాగా ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ.. అధికారిక ప్రకటన విడుదల

వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్

Updated Date - Nov 28 , 2026 | 07:06 AM