ఫైనల్లో పాకిస్థాన్ ‘ఎ’
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:03 AM
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ ‘ఎ’ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది.
బంగ్లాదేశ్ ‘ఎ’పై విజయం
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ ‘ఎ’ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో సెమీస్‌లో పాక్ 5 వికెట్లతో గెలిచింది. దీంతో ఈ టోర్నీలో ఐదుసార్లు ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా పాక్ నిలిచింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో శ్రీలంక ‘ఎ’తో పాక్ తలపడనుంది.
ముందుగా బంగ్లాదేశ్ ‘ఎ’ 50 ఓవర్లలో 232/8 స్కోరు చేసింది. షహదత్ హొస్సేన్ (103 నాటౌట్) అజేయ సెంచరీ సాధించగా మహీదుల్ ఇస్లాం (42) ఆకట్టుకున్నాడు. సుఫ్యాన్‌కు 3.. అలీ రజా, హసన్ నవాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పాక్ 45.2 ఓవర్లలో 5 వికెట్లకు 233 పరుగులు చేసింది. హసన్ నవాజ్ (62), షహజైబ్ ఖాన్ (50), ఫర్హాన్ (46 నాటౌట్), అబ్దుల్ సమద్ (44), నిలకడగా రాణించారు.
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్