Share News

మహిళల టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియాతో కీలక పోరు.. టాస్ నెగ్గిన భారత్

ABN , Publish Date - Jun 28 , 2026 | 06:44 PM

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హర్మన్ సేన.. భీకర ఆస్ట్రేలియాతో తలపడనుంది. లార్డ్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

మహిళల టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియాతో కీలక పోరు.. టాస్ నెగ్గిన భారత్
INDW vs AUSW

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హర్మన్ సేన.. భీకర ఆస్ట్రేలియాతో తలపడనుంది. లార్డ్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ తొలుత ఫీల్డింగ్‌ చేయనుంది. రెండు జట్లకూ ఇదే చివరి లీగ్‌ మ్యాచ్‌. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించిన ఆసీస్‌.. దాదాపుగా సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్‌ చేతిలో ఓడినా.. నెట్‌ రన్‌రేట్‌ (+4.724)లో మెరుగ్గా ఉండడం వల్ల ఆసీస్‌ అగ్రస్థానంతో ముందంజ వేసే అవకాశాలే ఎక్కువ. భారత్‌ మాత్రం గెలిస్తేనే సెమీస్‌ చేరే స్థితిలో ఉంది.


భారత్ తుది జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్

ఆసీస్ తుది జట్టు:

సోఫీ మోలీనెక్స్(కెప్టెన్), బెత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వాల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ, ఆష్లీ గార్డ్‌నర్, జార్జియా వారేహమ్, అనబెల్ సదర్లాండ్, నికోలా కెరీ, కిమ్ గాత్, లూసీ హామిల్టన్


ఇవి కూడా చదవండి:

విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడాలనుంది: టెన్నిస్ దిగ్గజం జకోవిచ్

ఫిఫా ప్రపంచ కప్ నుంచి ఇరాన్ ఔట్.. లాకర్ రూమ్‌లో మరో నోట్!

Updated Date - Jun 28 , 2026 | 06:44 PM