Share News

కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?

ABN , Publish Date - Jun 28 , 2026 | 06:23 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?
Kavya Maran, Anirudh Ravichander

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కావ్య, అనిరుధ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని అనిరుధ్‌ బంధువు, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


‘అనిరుధ్ మృదు స్వభావి. నాకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి సాధారణ వ్యక్తి కాదు. అంత పెద్ద టీమ్(SRH)ను నిర్వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది. తండ్రి వ్యాపార నైపుణ్యాలు ఆమెకు వచ్చాయి. ఇద్దరూ మంచి జోడీ. కలిసి మ్యూజిక్ బిజినెస్‌లో కూడా రాణించగలరు’ అని ఆయన పేర్కొన్నారు. మహేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలతో కావ్య-అనిరుధ్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే గతంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించిన సంగతి తెలిసిందే.


‘వై దిస్‌ కొలవెరి డీ’ పాటతో పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్‌.. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాల్లో అనేక హిట్‌ పాటలతో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. ‘జైలర్‌’, ‘జెర్సీ’, ‘జవాన్‌’, ‘లియో’ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. కావ్య.. సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌ కుమార్తె. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో మైదానంలో తనదైన హావభావాలతో పాపులర్‌ అయ్యారు. కళానిధి మారన్‌ నిర్మించిన ‘జైలర్‌’, ‘బీస్ట్‌’, ‘రాయన్‌’ తదితర చిత్రాలకు అనిరుధ్‌ సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి:

విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడాలనుంది: టెన్నిస్ దిగ్గజం జకోవిచ్

ఫిఫా ప్రపంచ కప్ నుంచి ఇరాన్ ఔట్.. లాకర్ రూమ్‌లో మరో నోట్!

Updated Date - Jun 28 , 2026 | 06:23 PM