Share News

విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడాలనుంది: టెన్నిస్ దిగ్గజం జకోవిచ్

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:20 PM

వింబుల్డన్ 2026 టోర్నీకి ముందు సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు.

విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడాలనుంది: టెన్నిస్ దిగ్గజం జకోవిచ్
Novak Djokovic

ఇంటర్నెట్ డెస్క్: వింబుల్డన్ 2026 టోర్నీకి ముందు సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు. త్వరలోనే భారత్‌కు వస్తానని చెప్పాడు. అప్పుడు విరాట్‌ను కలిసి అతడితో క్రికెట్, టెన్నిస్ ఆడాలనే తన కోరికను నెరవేర్చుకుంటానని జకోవిచ్ వెల్లడించాడు. ఈ సందర్భంగా జకోవిచ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.


‘విరాట్, నేను ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలవలేదు. కానీ గత కొన్నేళ్లుగా మెసేజ్‌ల ద్వారా టచ్‌లో ఉన్నాం. సోషల్ మీడియాలో ఒకరినొకరం ఫాలో అవుతున్నాం. నేను క్రికెట్ చూడటానికి కారణం కూడా అతడే. త్వరలోనే విరాట్‌ను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. అతడితో కలిసి టెన్నిస్, క్రికెట్ ఆడాలి. త్వరలోనే భారత పర్యటనకు వస్తా. అప్పుడు ఈ కోరిక నెరవేర్చుకుంటా’ అని జకోవిచ్ వెల్లడించాడు.


25వ గ్రాండ్‌స్లామ్‌పై గురి..

24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఈ వింబుల్డన్‌లో తన 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో వింబుల్డన్‌లో బలంగా పునరాగమనం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాడు. కాగా సోమవారం జరగనున్న తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్ యిబింగ్‌తో జకోవిచ్ తలపడనున్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌ వన్‌ యానిక్ సినర్ కూడా టైటిల్‌ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్‌లో సెర్బియా ఆటగాడు మియోమిర్‌ కెక్మనోవిచ్‌తో అతడు పోటీ పడనున్నాడు. విజయం సాధించి టోర్నీని శుభారంభం చేయాలనే పట్టుదలతో సినర్‌ ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్

వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..

Updated Date - Jun 28 , 2026 | 06:25 PM