ఐర్లాండ్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:46 PM
భారత టీ20 జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. నేడు బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో రెండో టీ20లో తలపడనుంది. టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. నేడు బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో రెండో టీ20లో తలపడనుంది. టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా తొలి టీ20లో ఘోర ఓటమిని చవి చూసిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి జట్టులో చోటు దక్కలేదు. కాగా భారత తరఫున యువ ప్లేయర్లు ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గె అరంగేట్రం చేశారు.
భారత్ తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబె, సూర్యాంశ్ షెడ్గె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
ఐర్లాండ్ తుది జట్టు:
టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూన్‌డ్రా, మాథ్యూ హోలార్డ్
ఇవి కూడా చదవండి:
విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడాలనుంది: టెన్నిస్ దిగ్గజం జకోవిచ్
ఫిఫా ప్రపంచ కప్ నుంచి ఇరాన్ ఔట్.. లాకర్ రూమ్‌లో మరో నోట్!