మహిళల ఆసియా గేమ్స్‌లో భారత్ భారీ స్కోర్.. సెంచరీతో విజృంభించిన షెఫాలి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:57 PM
ఆసియా గేమ్స్‌లోని రెండో సెమీ ఫైనల్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు విజృంభించింది. బంగ్లాదేశ్‌పై 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు విజయం దిశగా దూసుకుపోతోంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 20 ఓవర్లలో195 పరుగులు సాధించి భారీ స్కోరు చేసింది. షెఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌తో 49 బంతుల్లోనే సెంచరీ సాధించి అభిమానులను ఆకట్టుకుంది. తొమ్మిది సిక్సర్లు, మూడు ఫోర్లతో ఆమె గ్రౌండ్‌లో చెలరేగిపోయింది. 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విజృంభించింది.
షెఫాలికి స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తోడవడంతో టీమిండియా భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. 20 ఓవర్లలో బంగ్లా 196 పరుగులు ఛేదిస్తే ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. కాగా బంగ్లాదేశ్ బౌలర్లు మరుఫా అక్తర్, శంజిదా అక్తర్, రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలో వికెట్ తీసుకున్నారు. వికెట్లు తీసుకున్నప్పటికి మరుఫా, నహిదా ఇద్దరు కలిసి భారత బ్యాటర్లకు 91 పరుగులిచ్చి చెత్త ప్రదర్శన కనబరిచారు.
ఇవీ చదవండి
షూటింగ్‌లో రజతం, సుచికకు పతకం ఖాయం.. ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట షురూ..