Share News

వంటలు: అవకాడో ఖీర్‌

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:28 PM

అవకాడో ఖీర్‌ తయారీకి కావలసిన పదార్థాలు: అవకాడో గుజ్జు - 50 గ్రాములు, కొబ్బరి తురుము - 60 గ్రాములు, బియ్యం - 60 గ్రాములు.

వంటలు: అవకాడో ఖీర్‌
Vantalu

కావలసిన పదార్థాలు: అవకాడో గుజ్జు - 50 గ్రాములు, కొబ్బరి తురుము - 60 గ్రాములు, బియ్యం - 60 గ్రాములు, బెల్లం - 40 గ్రాములు, కాచిన పాలు - పావు లీటర్‌, నెయ్యి - నాలుగు స్పూన్లు, యాలకుల పొడి -స్పూను, జీడిపప్పు ముక్కలు - కొన్ని, ఎండు ద్రాక్ష - కొన్ని, నీళ్లు - తగినంత.


book9.2.jpgతయారుచేసే విధానం: బియ్యాన్ని 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి. ఈ బియ్యానికి, కొబ్బరి చేర్చి మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. బెల్లాన్ని పొడిగా చేసి, కాస్త నీళ్లు వేసి, గట్టి పాకం కాకముందే వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఓ వెడల్పాటి బాణలిలో నీళ్లు మసలుతుంటే బియ్యం ముద్దని చేర్చాలి. బియ్యం కాస్త ఉడికాక బెల్లం పాకం కలిపి దగ్గరగా వచ్చేలా చూడాలి. మూడు నిమిషాల తరవాత అవకాడో గుజ్జును కలిపి, యాలకుల పొడి వేసి మరో అయిదు నిమిషాల తరవాత స్టవ్‌ కట్టేయాలి. చిన్న బాణలిలో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష ముక్కలు వేయించుకుని పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన అవకాడో మిశ్రమానికి పాలు, వేయించిన జీడిపప్పు కలిపి కప్పుల్లో వేసి సర్వ్‌ చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 12:28 PM