Share News

మిల్లెట్‌ మోదుక..తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:05 PM

మిల్లెట్‌ మోదుక..తయారీకి కావలసిన పదార్థాలు: మిల్లెట్‌ పిండి - ముప్పావు కప్పు, నెయ్యి - రెండు స్పూన్లు, వేడి నీళ్లు - పావు కప్పు.

మిల్లెట్‌ మోదుక..తయారు చేసుకోండిలా..
Vantalu

కావలసిన పదార్థాలు: మిల్లెట్‌ పిండి - ముప్పావు కప్పు, నెయ్యి - రెండు స్పూన్లు, వేడి నీళ్లు - పావు కప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, బెల్లం తరుగు - రెండు స్పూన్లు, యాలకుల పొడి - పావు స్పూను, ఉప్పు - కాస్త.


తయారుచేసే విధానం: ఓ చిన్న బాణలిలో నెయ్యి వేసి కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పును వేయించాలి. ఆ తరవాత బెల్లాన్ని చేర్చాలి. పూర్తిగా కొబ్బరి తురుముతో కలిసిపోయాక స్టవ్‌ కట్టేయాలి. కాస్త వేడి నీళ్లని మోదుక పిండిలో వేసి బాగా కలిపి మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత పిండిని ముద్దలుగా చేసుకుని చిన్న పూరీల్లా వత్తుకోవాలి. మోదక అచ్చుల్లో ఒక్కో పూరీని పెట్టి అందులో కొబ్బరి మిశ్రమం వేసి అంచులు కలిపేయాలి. ఇలా తయారుచేసుకున్న మోదుకల్ని ఆవిరిపై ఉడికిస్తే మిల్లెట్‌ మోదుక సిద్ధం.


ఈ వార్తలు కూడా చదవండి:

శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 12:05 PM