Share News

వంటలు: చైనీస్‌ ఇడ్లీ

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:08 PM

చైనీస్‌ ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు: ఇడ్లీలు - ఆరు (ఒక్కోటీ నాలుగు ముక్కలుగా కట్‌ చేసినవి), ఉల్లి ముక్కలు - అర కప్పు.

వంటలు: చైనీస్‌ ఇడ్లీ
Chinese Idli Recipe

కావలసిన పదార్థాలు: ఇడ్లీలు - ఆరు (ఒక్కోటీ నాలుగు ముక్కలుగా కట్‌ చేసినవి), ఉల్లి ముక్కలు - అర కప్పు, వెల్లుల్లి ముక్కలు - ఒకటిన్నర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - రెండు స్పూన్లు, క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు, రెడ్‌ చిల్లీ సాస్‌ - రెండు న్పూన్లు, సోయా సాస్‌ - స్పూను, వెనిగర్‌ - స్పూను, చక్కెర - స్పూను, టమాటా కెచప్‌ - రెండు స్పూన్లు, కారం - అర స్పూను.


book8.2.jpgతయారుచేసే విధానం: ఓ పాన్‌లో ఉల్లిముక్కల్ని వేయించాలి. వెల్లుల్లి, క్యాప్సికమ్‌, పచ్చి మిర్చి జతచేయాలి. రెండు నిమిషాల తరవాత టమాటా కెచప్‌, సోయా సాస్‌, రెడ్‌ చిల్లీ సాస్‌, వెనిగర్‌, చక్కెర అన్నీ వేసి కలపాలి. తరవాత ఇడ్లీ ముక్కలు వేసి అన్నీ కలిపితే చైనీస్‌ ఇడ్లీ వెరైటీగా బాగుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

టాటూ... నొప్పికి టాటా!

ఆదమరిస్తే అన్నీ కష్టాలే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 12:08 PM