Share News

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:51 AM

అమెరికా ఒత్తిడికి తాము తలవంచబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, తర్కబద్ధమైన నిర్ణయాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..
Masoud Pezeshkian

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఒత్తిడికి తాము తలవంచబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. యుద్ధం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, తర్కబద్ధమైన నిర్ణయాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు కొనసాగుతున్న సమయంలో పెజెష్కియాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి (Masoud Pezeshkian Comments).


అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం విషయంలో ఇరాన్ ఎలాంటి రాజీ పడలేదని పెజెష్కియాన్ తెలిపారు. తమ దేశ భద్రతా మండలిలోని సభ్యులందరూ ఈ ఒప్పందాన్ని అత్యుత్తమమైనదిగా భావించారని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్న 'యుద్ధమూ కాదు.. శాంతీ కాదు' అనే పరిస్థితి నుంచి బయటపడేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పెజెష్కియాన్ అన్నారు. దేశంలో ఐక్యత, సమైక్యతను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు (Iran US tensions).


హోర్ముజ్ జలసంధి విషయంలో మాత్రం ఇరాన్ వైఖరి కఠినంగానే ఉంది (US Iran MoU). అమెరికా తన ప్రవర్తనను మార్చుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు హోర్ముజ్ జలసంధి తెరుచుకోదని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిళ్లలో పొరుగుదేశాలు భాగస్వాములైతే వాటిని కూడా శత్రువులుగా పరిగణిస్తామని రెజాయీ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 23 , 2026 | 12:08 PM