అందాల కిరీటం @ 75
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:02 AM
మిస్ వరల్డ్ ఈవెంట్ వేదికపై విజేతగా కిరీటం ధరించడం అందగత్తెల జీవితకాల స్వప్నం. ఇటీవల వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 పోటీలో డొమినిక్ రిపబ్లిక్‌కు చెందిన జొహెరీ మోలా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
మిస్ వరల్డ్ ఈవెంట్ వేదికపై విజేతగా కిరీటం ధరించడం అందగత్తెల జీవితకాల స్వప్నం. ఇటీవల వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 పోటీలో డొమినిక్ రిపబ్లిక్‌కు చెందిన జొహెరీ మోలా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అందాల సుందరికి అలంకరించే కిరీటం విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటిదాకా ఎంతోమంది ప్రపంచ సుందరీమణుల శిరస్సుపై మెరిసిన అందాల కిరీటానికి ఈ ఏడాదితో అక్షరాలా 75 ఏళ్లు.
మిస్ వరల్డ్ కిరీటం ధరను నిర్ణయించలేం. దీన్ని కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కిరీటానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విలువ అపారమైనవని అంటారు సంస్థ సీఈఓ జూలియా మోర్లీ.
మిస్ వరల్డ్ విజేతగా కిరీటం ధరించే సమయం విజేత జీవితంలో అత్యంత గర్వకారణమైన క్షణాల్లో ఒకటని చెబుతారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... విజేత ఆ అసలు కిరీటాన్ని తనతో తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు.
నీలిరంగులో మెరిసిపోతూ గుండ్రంగా ఉన్న కింది భాగం ప్రపంచానికి ప్రతీకగా ఉంటే దాని చుట్టూ ఉన్న బంగారు వర్ణంలో ఉన్న ఆరు శాఖలు ఖండాలకు ప్రతీకగా ఉంటాయి. వాటిపై ముత్యాలు, వజ్రాలను అమర్చారు.అలాగే కిరీటం కింది భాగాన్ని విడదీసి, విజేత తలకు సరిపోయేలా సర్దుబాటు చేసుకునే విధంగా రూపొందించారు.
మిస్ వరల్డ్ పోటీ ముగిశాక కిరీటాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ప్రత్యేకమైన బుల్లెట్‌ప్రూఫ్ వాల్ట్‌లో భద్రపరుస్తారు.

మిస్ వరల్డ్ కిరీటాన్ని 18 క్యారెట్ వైట్ గోల్డ్‌తో తయారుచేశారు. కిరీటంపై 1770 మెరిసే వజ్రాలను పొదిగారు. కిరీటం బరువు 175.49 క్యారెట్లు ఉంటుంది.
బ్రిటిష్ రాజకుటుంబానికి ఆభరణాలు తయారు చేసే ప్రసిద్ధ సంస్థ గేరార్డ్‌తో మిస్ వరల్డ్ కిరీటాన్ని తయారు చేయించారు. అందుకే మిస్ వరల్డ్ కిరీటాన్ని వెల కట్టలేం అని చెబుతారు.
నిజమైన కిరీటం మిస్ వరల్డ్ సంస్థ వద్దే ఉంటుంది. అది మిస్ వరల్డ్ పోటీకి సంబంధించిన వారసత్వానికి ఒక ముఖ్యమైన గుర్తుగా ఉంటుంది. విజేతకు మాత్రం అసలు కిరీటానికి ప్రతిరూపమైన మరో కిరీటం అందజేస్తారు. దాన్ని ఆమె తన విజయానికి గుర్తుగా, జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు.
మిస్ వరల్డ్ కిరీటం సాధారణమైన ఆభరణం కాదు. దాని వెనుక విజేతల క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, కృషి, పట్టుదల వంటి ఎన్నో విలువలు దాగి ఉంటాయి.
1966లో రీటా ఫరియా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు ఇదే మొదటి విజయం. ఆ తరువాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషీ చిల్లార్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. మొత్తంగా భారత్ 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.
ఈ ఏడాది వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో 111 దేశాలు పాల్గొన్నాయి.

1966లో రీటా ఫరియా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారత్‌కు ఇదే మొదటి విజయం. ఆ తరువాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషీ చిల్లార్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. మొత్తంగా భారత్ 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.
ప్రతీ సంవత్సరం వివిధ దేశాల్లో జరిగే జాతీయ స్థాయి అందాల పోటీలలో 10 లక్షలకు పైగా మహిళలు పాల్గొంటారని మిస్ వరల్డ్ సంస్థ చెబుతోంది. వారిలో కొద్దిమంది మాత్రమే జాతీయ విజేతలుగా నిలిచి మిస్ వరల్డ్ కోసం పోటీ పడతారు. ఏడు దశాబ్దాల చరిత్రలో 160కి పైగా దేశాలు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నాయి.
1972లో మిస్‌వరల్డ్ విజేతగా నిలిచిన బెలిండా లినెట్ గ్రీన్‌కు కిరీణ ధారణ చేసే సమయంలో క్రౌన్‌కు ఉన్న జెస్టర్ హెడ్‌పీస్ విరిగిపోయింది. దాంతో నిర్వాహకులు మిస్ యూకే విజేతకు క్వీన్ ఎలిజబెత్ 2 బహూకరించిన బ్లూ డైమండ్ కిరీటాన్ని అందించారు.
మిస్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. బ్రిటన్‌లో జరిగే వేడుకల్లో భాగంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదట ఈ ఈవెంట్‌ని ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచేవారు. స్విమ్‌సూట్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పోటీలను ప్రారంభించారు. వాటికి ఆదరణ పెరగడంతో ‘మిస్ వరల్డ్’ అని పేరు మార్చారు.

మిస్ వరల్డ్ టైటిల్‌ను అత్యధికంగా గెలుచుకున్న దేశాలలో భారత్, వెనిజువెలా ఉన్నాయి. ఒక్కో దేశం నుంచి ఆరుగురు విజేతలు ఉన్నారు.
మిస్ వరల్డ్ పోటీ తొలిసారిగా జూలై 27, 1951లో లండన్‌లో జరిగింది. ఇటీవల 75వ వార్షికోత్సవం జరిగింది. ఈ ఏడాది జరిగినవి 73వ మిస్ వరల్డ్ పోటీలు.
కేవలం అందం, ర్యాంప్ వాక్ మాత్రమే కాదు. సామాజిక సేవ, కమ్యూనికేషన్, ప్రతిభ, నాయకత్వం, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలకు పోటీలలో ప్రాధాన్యం ఉంటుంది.

మిస్ వరల్డ్ అందాల పోటీ మాత్రమే కాదు. ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే నినాదంతో ఇప్పటి వరకు సుమారు రూ. 9450 కోట్ల నిధులను సేకరించారు. వీటితో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
కొవిడ్ వల్ల 2020లో మిస్ వరల్డ్ పోటీలు జరగలేదు. ఆ తరువాత 2021లో జరగాల్సిన 70వ మిస్ వరల్డ్ పోటీలు ఆలస్యంగా 2022లో జరిగాయి. దాంతో 2022లో నిర్వహించాల్సిన పోటీలు జరగలేదు. 2023లో జరగాల్సిన పోటీలకు భారత్ ఆతిథ్యం వహించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో మనదగ్గర ఎన్నికలు జరుగుతుండటంతో పోటీలను వాయిదా వేసి, 2024 మార్చిలో నిర్వహించారు.
స్వీడన్‌కు చెందిన కికీ హకన్‌సన్ మొదటి విజేత. 22 ఏళ్ల వయసులో ఆమె మిస్ వరల్డ్ విజేతగా నిలిచారు.
మిస్ వరల్డ్ పోటీ 1951లో ప్రారంభమైంది. ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ పోటీ ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
మిస్ వరల్డ్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. 180కి పైగా దేశాల్లో టీవీ ప్రసారాల్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ ఈవెంట్‌గా గుర్తింపు పొందింది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి
Read Latest AP News And Telangana News And International News And Telugu News