కివీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం.. తిలక్, నితీశ్ పోరాటానికి గంభీర్ ఫిదా!
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:11 AM
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. యువ బ్యాటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి పోరాటంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఓ దశలో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువ బ్యాటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఆదుకున్నారు. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ పోరాటంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. మూడు పదాల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
‘బాయ్స్ బికమింగ్ మెన్’ (కుర్రాళ్లు.. ఎదుగుతున్నారు) అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. యువ ఆటగాళ్ల పోరాట పటిమను ప్రశంసిస్తూ గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఈ ఏడాది తిలక్ రికార్డులు అదుర్స్!
ఈ ఏడాది టీ20ల్లో 16 నుంచి 20 ఓవర్ల మధ్య తిలక్ వర్మ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. 203 బంతులు ఎదుర్కొని 470 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 231.52గా ఉంది. ఇందులో 32 ఫోర్లు, 37 సిక్సర్లు ఉన్నాయి. విజయవంతమైన టీ20 ఛేజింగ్‌లలోనూ తిలక్ రికార్డు అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 21 మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి 533 పరుగులు చేశాడు. 76.14 సగటుతో పాటు నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్ సమయంలో మిడిల్ ఆర్డర్ బాధ్యతలు చేపట్టిన తిలక్.. ఐదో స్థానం నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేస్తూ ఈ ఏడాది 600 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు