Share News

ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:50 PM

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. న్యూజిలాండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన భువీ.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
Bhuvneshwar Kumar

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. న్యూజిలాండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన భువీ.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తన రీఎంట్రీకి ఫ్యామిలీ కూడా ఓ కారణమని.. వాళ్లకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని వెల్లడించాడు. గతంలో భువీ జెర్సీ నంబర్ 15గా ఉండేది.. తాజాగా 78 నంబర్ జెర్సీ తీసుకున్నాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా వెల్లడించాడు.


‘నా జెర్సీ నంబర్ 78 తీసుకోవడం వెనుక ఓ లాజిక్ ఉంది. అంకెల మొత్తం ఆరు రావాలని అనుకున్నా. 15 సహా కొన్ని నంబర్లను ప్రయత్నించా. కానీ వాటిని ఇతర ఆటగాళ్లు తీసుకున్నారు. చివరకు ఆరు వచ్చే నంబర్ ఇదొక్కటే మిగిలింది. అందుకే దాన్ని ఎంచుకున్నా. పైగా గతంలో 15 నంబర్‌ జెర్సీ నాకు అలవాటు అయింది. ఇప్పుడు ఈ అంకెల మొత్తం కలిపితే కూడా 6 వస్తుంది. మొదట్లో నా జెర్సీపై కుమార్ అనే పేరు కూడా ఉండేది కాదు. ఇది నా జెర్సీ అని, దీన్ని నేను ధరించబోతున్నానని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది’ అని భువీ గుర్తు చేసుకున్నాడు.


నాకు పెద్దగా అంచనాలు లేవు..

‘టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గర్వకారణమే. ఈ రీఎంట్రీ వెనుక నా ఫ్యామిలీ మద్దతు ఉంది. అయితే దీని గురించి మేం ఒక్క రోజు కూడా మాట్లాడుకోలేదంటే నమ్ముతారా! ఈ పునరాగమనంలో నా ఆటతీరుపై నేనేమీ పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. గడిచిన నాలుగేళ్లుగా నా వంతుగా పని బాధ్యతలను నిర్వర్తిస్తూనే వచ్చా. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉన్నా. ఐపీఎల్ నన్ను ఎంతగానో మార్చింది’ అని భువీ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం

న్యూజిలాండ్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

Updated Date - Oct 24 , 2026 | 04:50 PM