Share News

ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం

ABN , Publish Date - Oct 24 , 2026 | 03:16 PM

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ రికార్డు బ్యాటింగ్‌లో కాదు.. ఫీల్డింగ్ కావడం విశేషం. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం
Tilak Varma World Record

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. అయితే ఈ రికార్డు బ్యాటింగ్‌లో కాదు.. ఫీల్డింగ్ కావడం విశేషం. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు.


మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌లను తిలక్ అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సీఫర్ట్‌ను, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మిచెల్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు క్యాచ్‌లతో ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తిలక్ ఖాతాలో మొత్తం 26 క్యాచ్‌లు చేరాయి. దీంతో ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హోవే పేరిట ఉన్న 25 క్యాచ్‌ల రికార్డును తిలక్ అధిగమించాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్.. ఈ వార్త రాసే సమయానికి 7 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. సంజు శాంసన్(14), వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా నిరాశపర్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

పల్లెల్లో ఈత కల్లు జోరు

ఆశలన్నీ ఆవిరై.. పొలంలో బైక్‌ రైడ్‌ చేస్తూ వినూత్న నిరసన

Updated Date - Oct 24 , 2026 | 03:16 PM