Share News

జయవర్దనే స్థానంలో కీరన్‌ పొలార్డ్‌.. ముంబై ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు..

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:39 AM

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ను నియమించింది. ఇప్పటివరకు జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన పొలార్డ్‌కు ప్రధాన కోచ్‌ బాధ్యతలు అప్పగించింది.

జయవర్దనే స్థానంలో కీరన్‌ పొలార్డ్‌.. ముంబై ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు..
Kieron Pollard

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ను నియమించింది. ఇప్పటివరకు ముంబై జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన పొలార్డ్‌కు ప్రధాన కోచ్‌ బాధ్యతలు అప్పగించింది. ఇటీవల మహేల జయవర్ధనే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ముంబై ఇండియన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది (Mumbai Indians New Head Coach).


ముంబై ఇండియన్స్‌తో పొలార్డ్‌ (Kieron Pollard)కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆటగాడిగా ఆ జట్టు తరఫున ఎన్నో విజయాల్లో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తాజాగా ప్రధాన కోచ్‌గా పదోన్నతి పొందాడు. ముంబై ఇండియన్స్‌ జట్టు సంస్కృతి, ఆటగాళ్ల సామర్థ్యాలు, ఐపీఎల్‌ పోటీ తీరుపై పొలార్డ్‌కు మంచి అవగాహన ఉంది. ఆటగాడిగా, బ్యాటింగ్‌ కోచ్‌గా సంపాదించిన అనుభవం కొత్త బాధ్యతల్లో ఉపయోగపడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.


ముంబై ఇండియన్స్‌ ప్రధాన కోచ్‌గా మహేల జయవర్ధనే తన బాధ్యతల నుంచి అక్టోబర్‌ 17న తప్పుకున్నాడు (IPL Cricket News). దీంతో 2027 సీజన్‌కు ముందు జట్టు కొత్త కోచ్‌ను నియమించాల్సి వచ్చింది. జయవర్ధనే గతంలో 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. జయవర్దనే ఆధ్వర్యంలో ముంబై జట్టు 2017, 2019, 2020 సీజన్లలో ఐపీఎల్‌ టైటిళ్లు సాధించింది. 2024లో తిరిగి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై 2025లో క్వాలిఫయర్‌-2 వరకు చేరింది. అయితే, 2026 సీజన్‌లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..


మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 24 , 2026 | 11:55 AM