భారత జట్టులోకి కుమార్ కుశాగ్రా.. ఇషాన్ కిషన్ స్థానంలో..
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:51 AM
న్యూజిలాండ్‌తో రెండో టీ20కి గాయం కారణంగా ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాటర్ కుమార్ కుశాగ్రను బీసీసీఐ ఎంపిక చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలి టీ20 మ్యాచ్‌లో తొడ కండరాల నొప్పి కారణంగా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వెద్య బృందం అతడిని పర్యవేక్షిస్తుందని బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. మరోవైపు ఇషాన్‌కి ప్రత్యామ్నాయంగా యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా టీమిండియాలోకి ఎంపికయ్యాడు.
ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఎ' జట్టుతో ఉన్న కుశాగ్రా త్వరలోనే ప్రధాన జట్టుతో కలవనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం కావడం వల్లే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ వెల్లడించారు. ఇషాన్ కనీసం ఒక మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం రెండో టీ20కి మాత్రమే కుశాగ్ర ఎంపికయ్యాడు. తదుపరి మ్యాచులకు మార్పులు జరుగనున్నాయి.
మరోవైపు ఇషాన్ కిషన్ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రీడల ఫైనల్ తర్వాత వైభవ్ మళ్లీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ బెంచ్‌కే పరిమితమైన ఈ యువ ఆటగాడికి ఇప్పుడు కీలక అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కిషన్ స్థానాన్ని భర్తీ చేస్తూ జట్టు విజయాల్లో వైభవ్ ఏ విధంగా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు..
చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక శివానందన్!
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మాతో రోహిత్ డ్యాన్స్.. వీడియో వైరల్