కివీస్‌తో రెండో టీ20: తెలుగు కుర్రాళ్లు అదుర్స్.. భారత్ అద్భుత విజయం
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:15 PM
క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ(51*), నితీశ్ కుమార్ రెడ్డి(26*) జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ(51*), నితీశ్ కుమార్ రెడ్డి(26*) జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్లు కోల్పోయి ఒక బంతి మిగిలి ఉండగానే ఆటను ముగించింది.

ఛేదనలో భారత టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. సంజు శాంసన్(14), వైభవ్ సూర్యవంశీ(4), శ్రేయస్ అయ్యర్(7), అక్షర్ పటేల్(11) విఫలమయ్యారు. అభిషేక్ శర్మ(27), నమన్ ధీర్(31) పర్వాలేదనిపించారు. ఆఖరిలో వచ్చిన తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి జట్టును గాడిలోకి తీసుకొచ్చారు. ఏడో వికెట్‌కు 30 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన కివీస్.. ఆఖరిలో తేలిపోయింది. ఫలితంగా భారత్ పోరాడి గెలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ శాంట్నర్ 4 వికెట్లతో చెలరేగగా, డఫీ, స్మిత్ చెరొక వికెట్ పడగొట్టారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(70), జాకబ్స్(58) హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా బ్యాటర్లంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ టిమ్ సీఫర్ట్(7), ఫిన్ అలెన్(16), డారెల్ మిచెల్(6), మిచెల్ శాంట్నర్(4*), బ్రేస్‌వెల్(10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం
న్యూజిలాండ్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?