Share News

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:02 PM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన హినా అకేచిపై పోరాడి గెలిచింది.

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన హినా అకేచిపై పోరాడి గెలిచింది. 21-10, 20-22, 21-16 గేమ్‌ల తేడాతో విజయాన్ని అందుకుని టైటిల్ పోరుకు అర్హత సాధించింది. పీవీ సింధు ఈ ఏడాది సూపర్ 750 ఫైనల్‌కు దూసుకెళ్లడం ఇది రెండోసారి. జులైలో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ విజేతగా నిలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా ఆమె రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-10తో గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో హినా అకేచి పుంజుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ గేమ్‌లో 22-20తో నెగ్గి మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు తన అనుభవాన్ని ఉపయోగించింది. కీలక పాయింట్ల వద్ద ఆధిపత్యం ప్రదర్శిస్తూ 21-16తో గేమ్‌ను గెలుచుకుంది. దీంతో మ్యాచ్‌తో పాటు ఫైనల్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ఆన్‌ సే యంగ్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం

న్యూజిలాండ్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

Updated Date - Oct 24 , 2026 | 05:02 PM