విండీస్‌తో ఐదో టీ20: అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం.. భువీకి పిలుపు
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:50 PM
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పునరాగమనం అనుకున్న దాని కంటే ముందుగానే జరగనుంది. శనివారం బెంగళూరు వేదికగా విండీస్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20కి భారత జట్టులో భువీకి స్థానం కల్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పునరాగమనం అనుకున్న దాని కంటే ముందుగానే జరగనుంది. శనివారం బెంగళూరు వేదికగా విండీస్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20కి భారత జట్టులో భువీకి స్థానం కల్పించారు. నాలుగో టీ20లో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. అతడి స్థానంలో భువీని తీసుకోనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
కాగా ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2 తేడాతో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల భువీ.. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అనుభవజ్ఞుడైన ఈ పేసర్ రాకతో చివరి టీ20కు బౌలింగ్ విభాగంలో అదనపు బలం చేకూరనుంది. అయితే తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందా? అనేది వేచి చూడాలి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భువీని ఎంపిక చేశారు. అయితే కివీస్ పర్యటనకు ముందుగానే అతడిని అంతర్జాతీయ మ్యాచ్‌లో చూసే అవకాశం రావడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నాలుగేళ్ల తర్వాత భువీ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఇవీ చదవండి:
వర్చువల్ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్
గుజరాతీ గర్బాకు స్విస్ అంబాసిడర్ మాయా టిస్సాఫి ఫిదా.!