రూ.285 కోట్ల సిరీస్.. వెస్టిండీస్‌కు మాత్రం ఒక్క రూపాయి కూడా దక్కదా..
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:47 PM
ప్రస్తుతం భారత్‌లో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య టీ-20 సిరీస్ సాగుతోంది. అంతకు ముందు వన్డే సిరీస్ జరిగింది. ఈ రెండు సిరీస్‌ల ద్వారా భారత్‌కు దాదాపు 30 కోట్ల డాలర్ల వరకు ఆదాయం సమకూరనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య టీ-20 సిరీస్ సాగుతోంది. అంతకు ముందు వన్డే సిరీస్ జరిగింది. ఈ రెండు సిరీస్‌ల ద్వారా భారత్‌కు దాదాపు 30 కోట్ల డాలర్ల వరకు ఆదాయం సమకూరనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 285 కోట్లు. అయితే ఇందులో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఒక్క రూపాయి కూడా దక్కదట. ఈ విధానంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ డెహ్రింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు (India vs West Indies 2026).
'భారత్‌లో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ ద్వారా 2 నుంచి 3 కోట్ల డాలర్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ ఆదాయం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అందదు. ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశ క్రికెట్ బోర్డే ప్రసార హక్కులు, వాణిజ్య ఒప్పందాలు, మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందుతుంది. భారత్‌లో సిరీస్ జరిగితే బీసీసీఐకి అక్కడి భారీ ప్రేక్షకాదరణ వల్ల అధిక ఆదాయం వస్తుంది. అదే వెస్టిండీస్‌లో సిరీస్ నిర్వహిస్తే ఇక్కడి పరిమిత ప్రేక్షకుల కారణంగా అంతటి ఆదాయం రాదు. ఈ వ్యత్యాసమే చిన్న క్రికెట్ బోర్డుల ఆర్థిక సమస్యలకు ఒక కారణం' అని డెహ్రింగ్ అభిప్రాయపడ్డారు (WI cricket financial crisis).
'అంతర్జాతీయ క్రికెట్లో ఆదాయ పంపిణీ విధానం 1997లో మారింది (Chris Dehring about BCCI revenue). అప్పటివరకు పర్యాటక జట్లకు ఆతిథ్య దేశాలు నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించే విధానం ఉండేది. 1997కు ముందు వెస్టిండీస్‌కు సొంతగడ్డపై సిరీస్ నిర్వహించడం కంటే, విదేశీ పర్యటనల ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చేది. అయితే, 1997లో ఐసీసీ సభ్య దేశాలు ఆదాయ నమూనాను మార్చే ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి. ఈ మార్పుతో ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆతిథ్య దేశం తన వద్దే ఉంచుకునే విధానం బలపడింది. ఈ నిర్ణయం వల్ల భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశాలకు ప్రయోజనం కలిగింది. చిన్న దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం పరిమిత ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది' అని డెహ్రింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్స్కీ ప్రయత్నాలు..
పసిడి ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..