Share News

హార్దిక్‌తో విభేదాలు.. కృనాల్ పాండ్య రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:36 PM

IPL 2026: హార్దిక్, కృనాల్ పాండ్య సోదరుల మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కృనాల్ స్పందించాడు. తమ సోదరుల మధ్య వస్తోన్న వార్తలను ఖండించాడు.

హార్దిక్‌తో విభేదాలు.. కృనాల్ పాండ్య రియాక్షన్ ఇదే!
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: హార్దిక్, కృనాల్ పాండ్య సోదరుల మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. హార్దిక్.. తన మాజీ భార్య నటాషాతో విడాకుల తర్వాత ప్రస్తుతం మహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇవన్నీ నచ్చకపోవడంతో సోదరుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ సమయంలో హార్దిక్ ఔటైన తర్వాత కృనాల్ పాండ్య పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. అతడిని అలాగే కోపంగా చూస్తూ హార్దిక్ డగౌట్‌కు వెళ్లాడు. ఈ ఘటన తర్వాత ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా ఈ అంశంపై కృనాల్ స్పందించాడు. తమ సోదరుల మధ్య వస్తోన్న వార్తలను ఖండించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.


డానిష్ @ మిస్టర్ నాగ్స్ కృనాల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అందులో భాగంగా అతడిని హార్దిక్‌తో విభేదాల గురించి ప్రశ్నించాడు.. ‘మీ ఇద్దరి బంధం బాగుంది కదా? లేకపోతే ఏదైనా గొడవా?’ అని నాగ్స్ ప్రశ్నించాడు. ‘అంతా బాగుంది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేయొద్దు’ అని కృనాల్ సమాధానమిచ్చాడు. ఇక లఖ్‌నవూ యువ ప్లేయర్ ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తోన్న ఆరోపణలపై కూడా కృనాల్ స్పందించాడు.


స్లెడ్జింగ్ కాదు..

‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేసినట్లు బయట నుంచి చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత.. ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్‌లో నువ్వు సిక్స్‌లు కొట్టగలవు. అయితే లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించు’ అని మాత్రమే చెప్పా. నేనెక్కడా స్టెడ్జింగ్ చేయలేదు. అతడు కూడా నవ్వేశాడు. అదంతా సరదాగా జరిగింది. నా స్టైల్‌ను చూసి.. నేను చాలా సీరియస్‌గా ఉంటానని నాకు కోపం ఎక్కువని అనుకుంటారు. కానీ స్వభావం అది కాదు’ అని కృనాల్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

డేంజరస్ పిచ్.. అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు

రైజర్స్‌.. రయ్‌ రయ్‌

Updated Date - Apr 22 , 2026 | 03:00 PM