సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:25 PM
క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ(బుధవారం) న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ(74).. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో లక్ష్య ఛేదనలోఅత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు.
అక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన కోహ్లీ.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డే ఛేజింగ్‌లో కోహ్లీ 8,741 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (8,720 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా కోహ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించే క్రమంలో కోహ్లీ సాధించిన గణాంకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సచిన్ 242 మ్యాచ్‌ల్లోని 232 ఇన్నింగ్స్‌ల్లో 8,720 పరుగులు చేయగా.. కోహ్లీ కేవలం 180 మ్యాచ్‌ల్లో 169 ఇన్నింగ్స్‌ల్లో 8,741 పరుగులు సాధించాడు.
ఇక బ్యాటింగ్ సగటు పరంగా చూసిన విరాట్ కోహ్లీ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఛేజింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్ సగటు ఏకంగా 66.21గా ఉండగా, సచిన్ సగటు 42.33 మాత్రమే ఉంది. లక్ష్య ఛేదనలో కోహ్లీ ఇప్పటివరకు 30 సెంచరీలు, 46 అర్ధశతకాలు సాధించగా, సచిన్ 17 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు బాదాడు. ఒత్తిడిని జయించడం, లక్ష్యాన్ని సులువుగా ఛేదించడంలో తనకు ఎవరు సాటిలేరని ఈ గణాంకాలతో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన ఘనతతో క్రికెట్ చరిత్రలో 'ఛేజ్ మాస్టర్'గా అతడి కీర్తి మరింత ఇనుమడించింది.
వన్డేల్లో ఛేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
విరాట్ కోహ్లీ (భారత్) - 169 ఇన్నింగ్స్, 8741 పరుగులు
సచిన్ టెండూల్కర్ (భారత్) - 232 ఇన్నింగ్స్, 8720 పరుగులు
రోహిత్ శర్మ (భారత్) - 163 ఇన్నింగ్స్, 6801 పరుగులు
సనత్ జయసూర్య (శ్రీలంక) - 210 ఇన్నింగ్స్, 5742 పరుగులు
జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 158 ఇన్నింగ్స్, 5575 పరుగులు
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ