Share News

పాక్ బాక్సర్‌ను చెంపదెబ్బ కొట్టిన భారత యూట్యూబర్!

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:34 PM

దుబాయ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. బాక్సింగ్ బౌట్ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన ఫేస్‌ఆఫ్‌లో భారత బాక్సర్ మనీశ్ శర్మ పాకిస్థాన్ ఫైటర్ రహీమ్ పరదెసీని చెంపదెబ్బ కొట్టాడు.

పాక్ బాక్సర్‌ను చెంపదెబ్బ కొట్టిన భారత యూట్యూబర్!
India vs Pakistan Boxing

స్పోర్ట్స్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ఏ క్రీడలోనైనా ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. హాకీ , క్రికెట్ వంటి క్రీడల్లో ఉన్న ఈ దాయాదుల పోరు తాజాగా బాక్సింగ్ రింగ్‌కు కూడా పాకింది. అయితే, ఈ ఆట ప్రారంభం కావడానికి ముందే దుబాయ్‌లో ఓ హైడ్రామా చోటు చేసుకుంది.


బాక్సింగ్ బౌట్ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన ఫేస్‌ఆఫ్‌లో భారత బాక్సర్, ప్రముఖ యూట్యూబర్ మనీశ్ శర్మ (హాఫ్ ఇంజనీర్) పాకిస్థాన్ ఫైటర్ రహీమ్ పరదెసీని చెంపదెబ్బ కొట్టాడు. తొలుత పాకిస్థాన్ బాక్సర్ రహీమ్ వేదికపై మనీశ్‌ను రెచ్చగొట్టేలా ఓవరాక్షన్ చేశాడు. దీంతో అతడికి చెంపదెబ్బతో మనీశ్ సమాధానం ఇచ్చాడు. ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే వారిద్దరినీ వేరుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈవెంట్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండగానే భారత్, పాక్ మధ్య పోరు మొదలైందని ఒక భారతీయ యూజర్ కామెంట్ చేశాడు. మనీశ్ శర్మ కొట్టిన చెంపదెబ్బను ఉద్దేశిస్తూ.. ఇండియాకు ఒక మెడల్ వచ్చేసిందంటూ మరొకరు సరదాగా స్పందించారు. ఈ ఘటనపై రహీమ్ పరదెసీ తీవ్రంగా స్పందిస్తూ.. ' నాపై పడిన చెంపదెబ్బకు నవంబర్ 6న రింగ్‌లో సమాధానం ఇస్తాను. అక్కడ నీ ఆట కూడా నీ చెంపదెబ్బలానే బలహీనంగా ఉంటుంది' అంటూ ఘాటుగా బదులిచ్చాడు.


గురుగ్రామ్‌కు చెందిన మనీశ్ శర్మ 'హాఫ్ ఇంజనీర్' పేరుతో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అందరికి సుపరిచితుడు. దుబాయ్‌లోని నిక్కి బీచ్‌లో నవంబర్ 6న బాక్సింగ్ బౌట్ పోటీలు జరగనున్నాయి. ఈ ఘటనతో దుబాయ్‌ వేదికగా జరగబోయే ఈ బాక్సింగ్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి.


ఈ వార్తలనూ చదవండి:

మిడ్‌టర్మ్ ఎన్నికల సర్‌ప్రైజ్.. యూఎస్‌లో తొలి ముస్లిం సెనెటర్

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు

ముస్లిం సెనెటర్ తొలి ప్రసంగం.. వాన్స్‌, ట్రంప్‌పై పంచ్‌లు

Updated Date - Nov 04 , 2026 | 04:50 PM