Share News

మిడ్‌టర్మ్ ఎన్నికల సర్‌ప్రైజ్.. యూఎస్‌లో తొలి ముస్లిం సెనెటర్

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:26 PM

అమెరికాలో ఈసారి మిడ్‌టర్మ్ ఎన్నికలు కొత్త అధ్యాయానికి తెరతీశాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం సెనెట్‌కు ఎన్నికయ్యారు.

మిడ్‌టర్మ్ ఎన్నికల సర్‌ప్రైజ్.. యూఎస్‌లో తొలి ముస్లిం సెనెటర్
Abdul El Sayed US Muslim Senator

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఈసారి మిడ్‌టర్మ్ ఎన్నికలు కొత్త అధ్యాయానికి తెరతీశాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ ముస్లిం సెనెట్‌కు ఎన్నికయ్యారు. మిచిగన్ రాష్ట్రం నుంచి బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయీద్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ రాజర్స్‌పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అబ్దుల్‌కు 22 లక్షల ఓట్లు పోలవగా ప్రత్యర్థి రాజర్స్‌కు 20 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ విజయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. అసలు పని ఇకపై మొదలవుతుందని కూడా చెప్పారు.


అబ్దుల్ కుటుంబం ఈజిప్టు నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడింది. వైద్యుడైన అబ్దుల్ గతంలో డెట్రాయిట్ అండ్ వెయిన్ కౌంటీ డిపార్ట్‌మెంట్ హెల్త్ డైరెక్టర్‌గా చేశారు. ఇక ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ నేత రాజర్స్ గతంలో ఎఫ్‌బీఐ అధికారిగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో రాజర్స్, ట్రంప్ అబ్దుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇస్లామిక్ అతివాద సానుభూతి పరుడని నిందించారు. జీహాదీ మూర్ఖుడని, అమెరికా అంటే ఆయనకు ద్వేషమని తిట్టిపోశారు. అయితే, దేశంలో పెరుగుతున్న జీవన వ్యయాలతో విసిగిపోయిన సాధారణ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీని కాదని డెమోక్రటిక్ పార్టీకి పట్టంకట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

Updated Date - Nov 04 , 2026 | 03:38 PM