Share News

అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్.. సర్వీస్‌ కాలం రెండేళ్లు పెంపు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:27 PM

అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నిపథ్ పథకంలో సర్వీస్ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎన్. రాజా సుబ్రమణి ఇవాళ (బుధవారం) వెల్లడించారు.

అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్.. సర్వీస్‌ కాలం రెండేళ్లు పెంపు

ఇంటర్నెట్ డెస్క్: అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నిపథ్ పథకం సర్వీస్ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎన్. రాజా సుబ్రమణి ఇవాళ (బుధవారం) వెల్లడించారు. సాధారణంగా అగ్నివీర్‌లకు నాలుగేళ్ల సర్వీస్ కాలం ఉంటుంది. ఇది పూర్తయ్యాక వీరిలోని 25 శాతం మంది త్రివిధ దళాల శాశ్వత కేడర్‌కు ఎంపిక అవుతారు. అయితే ఎంపికవ్వని 75 శాతం మంది కోసం అగ్నిపథ్ సర్వీస్ కాలాన్ని కేంద్రం నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచింది. దీంతో ఆ 75 శాతం అగ్నివీర్‌లకు శాశ్వత కేడర్‌లో చేరేందుకు మరో అవకాశం దొరకనుంది. 2022లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం మంచి ఫలితాలనిచ్చిందని సుబ్రమణి తెలిపారు.


కాగా నౌకాదళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ సర్వీస్ కాలం నవంబరు 21తో, వైమానిక దళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌ సర్వీస్ కాలం డిసెంబరు 21తో, సైన్యం మొదటి బ్యాచ్‌ సర్వీస్ కాలం డిసెంబరు 31తో ముగియనుంది. నాలుగేళ్ల క్రితం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో మొదటి విడతలో 24,400 మంది అగ్నివీర్‌లు చేరారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నాలుగేళ్లలో సైన్యంలో సుమారు 2,70,000 మంది, వాయుసేనలో 27,000 మంది, నేవీలో 21,000 మంది అగ్నివీర్‌లుగా నియమితులయ్యారు. అగ్నిపథ్ సర్వీస్ కాలంలో కేవలం ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టకుండా.. నైతిక విలువలు, నైపుణ్యాలూ నేర్పిస్తామని సీడీఎస్ జనరల్ ఎన్.ఎన్. రాజా సుబ్రమణి వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

వలస కార్మికులందరూ తిరిగి రండి.. బెంగాల్ సీఎం పిలుపు

దీపావళి, హోలికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు: యోగి

Updated Date - Nov 04 , 2026 | 04:34 PM