వలస కార్మికులందరూ తిరిగి రండి.. బెంగాల్ సీఎం పిలుపు
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:17 PM
ఉపాధి కోసం బెంగాల్ విడిచి వెళ్లిన కార్మికులను తిరిగి రావాలని ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి కోరారు. వచ్చిన వారికి కచ్చితంగా ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న వీబీ జీ రామ్ జీ పథకం కింద కార్మికులందరికీ 125 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఇప్పుడు వీబీ జీ రామ్ జీ పథకం అమలవుతోంది. దీని కింద కార్మికులకు కచ్చితంగా ఉపాధి కల్పిస్తాం. కాబట్టి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులంతా తిరిగి బెంగాల్‌కు రండి. సొంత రాష్ట్రంలో పని చేసుకుంటూ కుటుంబంతో కలిసి ఉండండి’ అంటూ సువేందు అధికారి పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) పంచాయతీ శాఖ సమావేశానికి హాజరైన ఆయన.. వలస కార్మికుల కోసం ఈ పిలుపునిచ్చారు.
పంచాయతీ శాఖ సమావేశంలో బెంగాల్ సీఎం మాట్లాడుతూ.. వీబీ జీ రామ్ జీ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 22 కోట్ల పనిదినాలను నమోదు చేసే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ టార్గెట్‌ను తాము త్వరలోనే అందుకుంటామని ఆయన ధీమాగా చెప్పారు. అలాగే ఈ పథకం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.12,000 కోట్ల నిధులు కేటాయించాయని వివరించారు. ఇప్పటి వరకు బెంగాల్లో 65.62 లక్షల పని దినాలు నమోదు చేశామని వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
దీపావళి, హోలికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు: యోగి
ఎప్పుడైనా, ఎక్కడైనా.... బహిరంగ చర్చకు సిద్ధమా?