దీపావళి, హోలికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు: యోగి
ABN , Publish Date - Nov 04 , 2026 | 08:15 AM
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ఆయన ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం రాష్ట్రంలో 1.89 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ రీఫిల్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఉజ్వల్ పథకం కింద అర్హులైన కుటుంబాలకు సిలిండర్ రీఫిల్ సబ్సిడీని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
ప్రస్తుతం గృహ వినియోగ (డొమెస్టిక్) ఎల్పీజీ సిలిండర్ ధర రూ.983.45గా ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.335ను రాయితీగా అందిస్తోందని తెలిపారు. మిగిలిన రూ.648.55ను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పండుగల సందర్భంగా ఉచితంగా అందించే సిలిండర్ వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని, ఆ డబ్బుతో దీపావళికి స్వీట్లు, దీపాలు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తమ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించిందని యోగి వ్యాఖ్యానించారు. అలాగే ఈనెల 7న అయోధ్యలో నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమం సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దీపోత్సవ్ ఏర్పాట్లను సమీక్షించేందుకు యోగి అయోధ్యను సందర్శించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం