సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:06 AM
భారత నౌకాదళం అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలపై విరుచుకుపడింది.
అరేబియా సముద్రంలో 48 గంటలపాటు ఆపరేషన్
20 మంది ఇరాన్ మత్స్యకారులు సురక్షితం
న్యూఢిల్లీ, నవంబరు 3: భారత నౌకాదళం అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలపై విరుచుకుపడింది. వారి ఆట కట్టించి ఇరాన్‌కు చెందిన 20మంది మత్స్యకారులను రక్షించింది. ఆఫ్రికా దేశం సోమాలియా ఈశాన్య తీరంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్ మత్స్యకారుల పడవ అజినిని అక్టోబరు 29న చెర పట్టిన సోమాలి పైరేట్లపై చేపట్టిన ఈ ఆపరేషన్ 48 గంటల పాటు సాగి సోమవారం ముగిసింది. ముంబయి తీరానికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ కోసం వైమానిక దళం నిఘా విమానాన్ని, యుద్ధ నౌకను రంగంలోకి దించారు. ఈ రెండూ పూర్తి సమన్వయంతో పనిచేసి ఇరాన్ పడవను గుర్తించి దాన్ని పైరేట్లు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్లో వైమానిక దళం సీ-17 విమానం ద్వారా మెరైన్ కమాండోలను కూడా రంగంలోకి దించారు.