Share News

విదేశీ కోర్టు ఇచ్చిన విడాకులు చెల్లవు

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:10 AM

భారతీయ దంపతుల వివాదంలో విదేశీ కోర్టులు ఇచ్చిన విడాకులు చెల్లవని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరిదిద్దలేనంతగా వివాహబంధం చెడిపోయిందన్న కారణంతో మంజూరు చేసిన విడాకులకు చట్టబద్ధత లేదని తెలిపింది.

విదేశీ కోర్టు ఇచ్చిన విడాకులు చెల్లవు

  • సత్తెనపల్లి మహిళ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, నవంబరు 3: భారతీయ దంపతుల వివాదంలో విదేశీ కోర్టులు ఇచ్చిన విడాకులు చెల్లవని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరిదిద్దలేనంతగా వివాహబంధం చెడిపోయిందన్న కారణంతో మంజూరు చేసిన విడాకులకు చట్టబద్ధత లేదని తెలిపింది. అలాంటి తీర్పును దేశంలో అమలు చేయలేరని జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌ల ధర్మాసనం పేర్కొంది. భర్త విదేశీ పౌరసత్వం తీసుకొని, అక్కడ రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఇక్కడ నమోదైన కేసు మాత్రం కొనసాగుతుందని తెలిపింది. ఓ వ్యక్తి 2003 ఏప్రిల్‌ 18న సత్తెనపల్లిలో వివాహం చేసుకున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం ఆయన 2007 యునైటెడ్‌ కింగ్‌డం వెళ్లగా, ఆ తరువాత ఆమె వెళ్లింది. ప్రసవం నిమిత్తం పుట్టింటికి వచ్చిన ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లలేదు. వివాహబంధం దెబ్బతినడంతో విడాకుల కోసం ఆయన నరసరావుపేట కోర్టులో పిటిషన్‌ వేయగా తిరస్కరించింది.

తరువాత హైకోర్టులో అప్పీలు దాఖలు చేసి, విరమించుకున్నారు. 2013 ఫిబ్రవరి ఒకటిన ఆయనకు బ్రిటన్‌ పౌరసత్వం రావడంతో దానిని ఆధారం చేసుకొని కేంబ్రిడ్జి కౌంటీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. సరిదిద్దలేనంతగా వివాహబంధం దెబ్బతిందని పేర్కొంటూ ఆ కోర్టు 2014లో విడాకులు మంజూరు చేసింది. తరువాత ఆయన నార్‌ఫ్లోక్‌లో ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ రెండేళ్ల అనంతరం ఆయనపై మొదటిభార్య నర్సరావుపేట టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిని కొనసాగించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండో భార్య, ఆయన తల్లిదండ్రులపై పెట్టిన క్రిమినల్‌ కేసులను మాత్రం కొట్టివేసింది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 06:12 AM