హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ.. కివీస్‌పై భారత్ ఘన విజయం
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:21 PM
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) భారత్ ఘన విజయం సాధించింది. . టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది.
స్పోర్ట్స్ డెస్క్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) భారత్ ఘన విజయం సాధించింది. . టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్ 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(74) అర్ధ సెంచరీతో రాణించండంతో భారత్ 22.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.