భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:19 PM
చాలా కాలం తర్వాత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి టీమిండియాలో తిరికి చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై మరో స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ సంచలన కామెంట్స్ చేశాడు.
గతకొంతకాలంగా భారత క్రికెట్ జట్టు విషయంలో స్టార్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ , మహమ్మద్ షమీ ఇద్దరూ ఒకేలాంటి పరిస్థితిలో ఉన్నారు. దాదాపు ఒకే వయసున్న ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు, దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టుకు దూరమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు బీసీసీఐ సెలక్టర్లు టీ20 జట్టును ప్రకటించడంతో ఆ పరిస్థితి అంతా మారిపోయింది. భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేయగా, షమీకి మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తనకు జాతీయ జట్టులో అవకాశం దక్కకపోవడపై షమీ సంచలన కామెంట్స్ చేశాడు
రేపటి(ఆదివారం) నుంచి రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షమీ మీడియాతో మాట్లాడుతూ.. 'భువనేశ్వర్ కుమార్‌కు భారత్ తరఫున ఆడే అవకాశం లభించింది. అది అతడికి మంచి విషయమే. ఇక నా విషయానికి వస్తే...నాకు ఎక్కడ ఆడే అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా ఈ రంజీ మ్యాచ్‌పైనే ఉంది. గత రెండు మూడేళ్లుగా నా విషయంలోనూ ఇదే జరుగుతోంది. నేను రాణిస్తూ బెంగాల్ జట్టుకు నా ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాను. ఒకవేళ నాకు మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశం రాకపోయినా, అది నాకు నష్టమేమీ కాదు' అని షమీ పేర్కొన్నాడు. ఇటీవల భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లకు ఎందుకు ఆడే అవకాశం లభించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!
ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్
టీమిండియాతో సిరీస్.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ