ట్రంప్‌తో పుతిన్ ఫోన్ కాల్.. ఇరాన్ శాంతి ప్రతిపాదనపై కీలక చర్చ..
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:02 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్ అభిప్రాయాలను, యుద్ధాన్ని పరిష్కరించేందుకు ఆ దేశం అనుసరించాలనుకుంటున్న మార్గాన్ని ట్రంప్‌నకు వివరించినట్లు క్రెమ్లిన్ తాజాగా వెల్లడించింది. అయితే, ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఎలా స్పందించారనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు (Putin Trump phone call).
శుక్రవారం జరిగిన ఫోన్ సంభాషణలో ఇరాన్‌కు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అభిప్రాయాలను ట్రంప్ దృష్టికి పుతిన్ తీసుకెళ్లినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికాతో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం కనుగొనే దిశగా ఇరాన్ అభిప్రాయాలను అమెరికా అధ్యక్షుడికి పుతిన్ తెలియశారని పేర్కొన్నారు. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి ముందు పుతిన్ తుర్క్‌మెనిస్థాన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశమయ్యారు (US Iran peace deal).
పశ్చిమాసియాలో శాంతిని తిరిగి నెలకొల్పే దిశగా మధ్యవర్తిత్వం చేసేందుకు రష్యా ఆసక్తి చూపుతున్నట్లు పుతిన్ గతంలోనే సంకేతాలిచ్చారు (Kremlin statement). తాజాగా ఆ దిశగా ముందడుగు వేశారు. అయితే పుతిన్ ప్రతిపాదనలకు ట్రంప్ స్పందన ఏంటనేది క్రెమ్లిన్ వెల్లడించలేదు. అలాగే, ఇరాన్ ప్రతిపాదనల్లో ఉన్న కీలక అంశాలు ఏమిటన్న దానిపైనా వివరాలు లేవు.
ఇవి కూడా చదవండి..
భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి