టీమిండియాతో సిరీస్.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:49 PM
భారత్, న్యూజిలాండ్ మధ్య త్వరలో మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ విల్ ఓ రూర్క్ కు గాయమైంది. ఈ కారణంతో అతడు భారత్‌తో జరగనున్న టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య త్వరలో మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ విల్ ఓ రూర్క్ కు గాయమైంది. ఈ కారణంతో అతడు భారత్‌తో జరగనున్న టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. రూర్క్ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్‌తో పాటు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు కివీస్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. రూర్క్‌తో పాటు మార్క్ చాప్‌మన్, జాక్ ఫౌల్కేస్ కూడా టీ20లకు దూరమయ్యారు.
తాజాగా రూర్క్ గాయాన్ని న్యూజిలాండ్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ నాటికి రూర్క్ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వస్తాడని వాల్టర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగే ప్రతిష్ఠాత్మాక సిరీస్‌కు విల్ రూర్క్ దూరం కావడం తమని తీవ్ర నిరాశపరిచిందన్నాడు. అయితే అతడు ప్రస్తుతం రెండు గాయాలతో బాధపడుతున్నాడని, పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ఱయించామని వాల్టర్ వెల్లడించాడు. భారత్‌తో సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడనున్నామని, ఆ సిరీస్ నాటికి రూర్క్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావిస్తున్నామని వాల్టర్ పేర్కొన్నాడు.
మరోవైపు రూర్క్‌కు టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 2024లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 14 టెస్టులు మాత్రమే ఆడిన ఓరూర్క్.. 49 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 10 వికెట్లు తీశాడు. అయితే ఆ సిరీస్‌లోని చివరి టెస్టులో అతడు కాలి కండరాల గాయానికి గురయ్యాడు. అప్పటి నుంచి అతడు ఆటకు దూరంగా ఉంటున్నాడు. అంతకుముందు వెన్నునొప్పి కారణంగా ఏడు నెలల పాటు రూర్క్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై 2-1తో న్యూజిలాండ్ సిరీస్ గెలవడంలో రూర్క్ కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఆసీస్ జట్టులో అందరూ 30 ఏళ్లు దాటినవారే!
షమీకి జట్టులో చోటు దక్కుతుందని అనుకోవడం లేదు: ఆకాశ్ చోప్రా