Share News

టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఆసీస్ జట్టులో అందరూ 30 ఏళ్లు దాటినవారే!

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:43 PM

ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఆసీస్ జట్టులో అందరూ 30 ఏళ్లు దాటినవారే!
Australia Test cricket

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. అయితే ఇది గొప్ప ఘనతేమీ కాదు! టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా 30 ఏళ్లు దాటిన 11 మంది ప్లేయర్లతో ఆసీస్ బరిలోకి దిగింది. యువ ప్లేయర్ల కొరతకు ఇది అద్దం పడుతుందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


ఆస్ట్రేలియా 1877లో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా డర్బన్‌ టెస్టులో ఆ జట్టు మొత్తం 30 ఏళ్లు దాటిన ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ గాయంతో దూరం కావడంతో 30 ఏళ్ల మ్యాట్‌ రెన్‌షా జట్టులోకి వచ్చాడు. మరోవైపు 34 ఏళ్ల నిక్‌ మాడిన్సన్‌కు కూడా అవకాశం కల్పించారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మాడిన్సన్‌ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. వీరిద్దరూ స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ క్యారీ వంటి సీనియర్‌ ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నారు. దీంతో ఆసీస్‌ టెస్టు జట్టు మొత్తం 30 ఏళ్లు దాటిన ఆటగాళ్లతోనే నిండిపోయింది.


యువ ఆటగాళ్లకు చోటేది?

ఆస్ట్రేలియా జట్టులో యువ ఆటగాళ్లు టెస్టు స్థాయిలో తమ స్థానాన్ని పదిలం చేసుకోలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్‌ ఖవాజా స్థానాన్ని భర్తీ చేసే సరైన ఓపెనర్‌ కోసం ఆసీస్‌ ఇంకా అన్వేషిస్తోంది. మరోవైపు మార్నస్‌ లబుషేన్‌ వంటి ఆటగాళ్లు కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయినా జట్టులో కొనసాగుతున్నారు. స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌ అప్పుడప్పుడు రాణిస్తున్నా.. మిగతా బ్యాటర్ల నుంచి స్థిరమైన ప్రదర్శన రావడం లేదు. దీంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలా? లేక అనుభవజ్ఞులపైనే నమ్మకం ఉంచాలా? అన్న సందిగ్ధంలో జట్టు యాజమాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌పై ఓటమికి బౌలింగ్ కోచ్ సమాధానం చెప్పాలి: గావస్కర్

249 పరుగులు చేసినా భారత్ ఓటమి.. ఎవరినీ నిందించలేను: గంభీర్

Updated Date - Oct 10 , 2026 | 12:46 PM