Share News

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:51 PM

రాంచీ వేదికగావెస్టిండీస్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో భారత జట్టు 249 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ విజయం సాధించలేదు. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

స్పోర్ట్స్ డెస్క్: రాంచీ వేదికగావెస్టిండీస్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో భారత జట్టు 249 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ విజయం సాధించలేదు. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అలానే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేన వ్యూహాలపై ఆయన కొన్ని కీలక విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌ను ప్రత్యర్థి కైవసం చేసుకోవడానికి చివరి దశలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని గావస్కర్ అభిప్రాయపడ్డారు.


ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన కీలకమైన 17వ ఓవర్‌ను స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు ఇవ్వడం పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఆ ఓవర్‌లో విండీస్ బ్యాటర్లు విరుచుకుపడి 24 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ వేసిన 18వ ఓవర్‌లోనూ 17 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా కరీబియన్ల చేతుల్లోకి వెళ్లింది. చివరకు 19వ ఓవర్‌లోనే విండీస్ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


ఆ పరిస్థితులపై కూడా గావస్కర్ స్పందిస్తూ.. 'ఆ సమయంలో కుల్‌దీప్‌కు బదులుగా మయాంక్ యాదవ్ లేదా అర్ష్‌దీప్ తో బౌలింగ్ వేయించి ఉండే బాగుండేది. అప్పటికే మూడు వికెట్లు తీసి మంచి ఊపుమీదున్న మయాంక్‌ను కీలక సమయంలో బౌలింగ్‌కు దించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది' అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. అలాగే ఇన్నింగ్స్ ప్రారంభంలో(9వ ఓవర్లో) శివమ్ దూబేకు బౌలింగ్ ఇవ్వడం కూడా సరికాదని, బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటున్న ఆ సమయంలో కుల్‌దీప్‌ను రంగంలోకి దింపి ఉండాల్సిందని ఆయన సూచించారు. భారీ స్కోరు చేసినా బౌలింగ్ మార్పుల్లో జరిగిన పొరపాట్ల వల్లే భారత్ పరాజయాన్ని చవిచూసిందని గావస్కర్ విశ్లేషించారు.


ఇవి కూడా చదవండి:

తూ.గో జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు

బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చడం లేదా..? నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు!

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 10 , 2026 | 03:54 PM