Share News

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్‌ స్టార్క్‌ ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:40 PM

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్క్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఆస్ట్రేలియా స్టార్  బౌలర్  మిచెల్‌ స్టార్క్‌ ప్రపంచ రికార్డు
Mitchell Starc

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్క్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా(బంతుల ప‌రంగా) 450 వికెట్ల మైలు రాయిని అంద‌కున్న ఫాస్ట్ బౌల‌ర్‌గా స్టార్క్ చ‌రిత్ర సృష్టించాడు. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డ్ బ్రేక్ అయ్యింది.


సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో వియాన్ ముల్డ‌న్‌ను ఔట్ చేసి స్టార్క్ ఈ ఘ‌న‌త సాధించాడు. స్టార్క్ కేవ‌లం 20,577 బంతుల్లో బంతుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. గతంలో ఈ ప్ర‌పంచ రికార్డు గ్లెన్ మెక్‌గ్రాత్( 23,474 బంతులు) పేరిట ఉండేది. అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ కూడా స్టార్క్ కావ‌డం విశేషం. ఓవరాల్‌గా 450 టెస్టు వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రికార్డు ఇప్పటికీ శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు కేవలం 80 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అత‌డి త‌ర్వాతి స్థానంలో టీమిండియా స్పిన్న‌ర్ అశ్విన్‌(89) ఉన్నాడు.


టెస్టుల్లో వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లు (మ్యాచ్‌ల పరంగా):

  • ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక) - 80 మ్యాచులు

  • రవిచంద్రన్ అశ్విన్(భారత్) - 89 మ్యాచులు

  • అనిల్ కుంబ్లే(భారత్) - 93 మ్యాచులు

  • గ్లెన్ మెక్‌గ్రాత్(ఆస్ట్రేలియా) - 100 మ్యాచులు

  • షేన్ వార్న్(ఆస్ట్రేలియా) - 101 మ్యాచులు

  • మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) - 109 మ్యాచులు*


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!

పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం

ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా

Updated Date - Oct 20 , 2026 | 05:01 PM