Share News

హాంకాంగ్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 03:54 PM

హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు.

హాంకాంగ్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
Hong Kong Bathukamma celebrations

ఇంటర్నెట్ డెస్క్: హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. సుందర ద్వీపమైన హాంకాంగ్‌లో తెలుగు కుటుంబాలు చాలా తక్కువ. వారిలో అధికశాతం వలసవాసులే. అయినప్పటికీ, మన పండుగలను, సంప్రదాయాలను పాటించడంలో వారి ఉత్సాహం ఎప్పటికీ తగ్గదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను నిర్వహించడం ఈ సమాఖ్యకు ఒక అందమైన సంప్రదాయంగా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఆడపడుచులు అలంకారభూషితంగా సింగారించి, విభిన్న రకాల బతుకమ్మలను తయారు చేసి, తుంగ్‌చుంగ్ ప్రామినాడ్ వద్ద పాటలు పాడుతూ బతుకమ్మను సాగనంపారు. ఈ వేడుకలో వారి ఆనందం, ఉత్సాహం ప్రత్యేకంగా ప్రతిఫలించింది. పాఠశాల సెలవుల కారణంగా అనేక కుటుంబాలు హాంకాంగ్‌ను విడిచి ప్రయాణాలకు వెళ్లినప్పటికీ, కార్యక్రమంలో పాల్గొన్నవారి ఉత్సాహం తగ్గలేదు.


ఈ సంవత్సరం వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే హాంకాంగ్‌లోని తమ పిల్లల వద్దకు వచ్చిన తల్లిదండ్రులను, వారు ఇక్కడ తక్కువ కాలం మాత్రమే ఉన్నప్పటికీ సంతోషంగా ఉంచేందుకు సమాఖ్య వ్యవస్థాపకురాలు ప్రారంభించిన ‘జాలీ గుడ్ మైత్రీవనం’ కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా ఆమె శ్రేయస్సు, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిని చురుకుగా అనుసంధానిస్తున్నారు.

2.jpg


‘జాలీ గుడ్ మైత్రీవనం’లోని పెద్దలు (సీనియర్ సిటిజన్స్) కూడా ఈ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు బతుకమ్మ పండుగలో పాల్గొని, దాని ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ పండుగలోని సాంస్కృతిక వైభవం వారిని ఆకట్టుకుంది. హాంకాంగ్‌లో బతుకమ్మ పండుగను ఈ విధంగా జరుపుకోవడం భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.


ఇవీ చదవండి:

దుబాయిలో వైభవంగా GTWCA బతుకమ్మ సంబరాలు

బహ్రెయిన్‌లో ఘనంగా దసరా–బతుకమ్మ సంబరాలు

Updated Date - Oct 20 , 2026 | 04:00 PM