టీమిండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు ఐసీసీ షాక్!
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:41 PM
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు ఐసీసీ షాకిచ్చింది. రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 'కోడ్ ఆఫ్ కాండక్ట్' ను ఉల్లంఘించినందుకు గాను షఫాలీపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు ఐసీసీ షాకిచ్చింది. రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 'కోడ్ ఆఫ్ కాండక్ట్' ను ఉల్లంఘించినందుకు గాను షఫాలీపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమె 55 పరుగులు చేయగా.. భారత్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
అసలేం జరిగిందంటే...
రెండో మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ సమయంలో చిపో ముగెరి-తిరిపానో ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను షఫాలీ డ్రాప్ చేసింది. దీంతో నిరాశకు గురైన ఆమె కోపంతో బంతిని నేలకేసి విసిరికొట్టింది. ఐసీసీ ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. ఈ క్రమంలోనే ఐసీసీ షఫాలీ వర్మను మందలించడంతో పాటు, ఆమె క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చి.. బిగ్ షాక్ ఇచ్చింది. ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ సభ్యురాలైన జీఎస్ లక్ష్మి ఈ శిక్షను విధించారు. షఫాలీ వర్మ అధికారిక విచారణ అవసరం తప్పింది.
'లెవెల్ 1 ఉల్లంఘన కింద కనీస శిక్షగా అధికారిక మందలింపు లేదా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫీజు కోత, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధింస్తారు' అని ఐసీసీ పేర్కొంది. గత 24 నెలల్లో షఫాలీ వర్మ క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడటం ఇదే మొదటిసారి. రెండో టీ20 మ్యాచ్‌లో షఫాలీ దుమ్ములేపింది. ఈ డాషింగ్ ఓపెనర్ కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేసి ఔటైంది. ఈ ఇన్నింగ్స్‌తో ఓ వరల్డ్ రికార్డును షఫాలీ తన పేరిట లిఖించుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా స్మృతి మంధాన(8)ను షఫాలీ(9) అధిగమించింది.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!
పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం
ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా