Share News

ఆసియా కప్.. పాకిస్థాన్‌పై నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్

ABN , Publish Date - Sep 06 , 2026 | 07:46 AM

మహిళల ఆసియా కప్‌లో శనివారం పాకిస్థాన్‌పై గెలవడంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే

ఆసియా కప్.. పాకిస్థాన్‌పై నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్‌లో శనివారం పాకిస్థాన్‌పై గెలవడంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్ల ధాటికి పాక్ 55 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో ఆటను ముగించారు. మ్యాచ్ అనంతరం హర్మన్ జట్టు ప్రదర్శనపై మాట్లాడింది.


‘మాకు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. జట్టు ఏదైనా నిర్దాక్షిణ్యంగా ఆడాలని ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. పాకిస్థాన్‌పై కూడా అదే ప్రణాళిక అమలు చేశాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయిలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్‌ను అర్థం చేసుకుని సమర్థంగా ఆడారు. సెమీ ఫైనల్ బెర్తు ఖరారు అయిందని అలసత్వం పాటించలేదు. జట్టు ప్రమాణాలను ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ జట్టు సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. ఛేదనలో వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయాం. ఇది క్రికెట్‌లో సహజమే. పాకిస్థాన్‌కు మంచి బౌలింగ్‌ దళం ఉంది’ అని హర్మన్ పేర్కొంది.


ఒక్కసారిగా పతనం ఎదురైంది: ఫాతిమా సనా

పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా తీవ్ర నిరాశకు గురైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేయాలన్న నిర్ణయం తప్పేమీ కాదని ఆమె సమర్థించుకుంది. ‘మాకు ఒక్కసారిగా పతనం ఎదురైంది. వికెట్‌ కొత్తగా ఉంది. మా బౌలింగ్‌ దళం బలంగా ఉండటంతో ముందుగా బ్యాటింగ్‌ చేసి వీలైనంత ఎక్కువ స్కోరు చేయాలని అనుకున్నాం. కానీ మా ప్రణాళికల వర్కౌట్ అవ్వలేదు. మా చివరి గ్రూప్ మ్యాచ్‌లో మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని ఫాతిమా వెల్లడించింది. భారత్‌ ఛేదనలో ఫాతిమా మాత్రమే ప్రభావవంతంగా బౌలింగ్‌ చేసింది. మూడు వికెట్లు పడగొట్టినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయింది.


ఇవి కూడా చదవండి:

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా

యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా

Updated Date - Sep 06 , 2026 | 08:01 AM