Share News

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:36 PM

న్యూజిలాండ్ పర్యటన కోసం ప్రకటించిన వన్డే జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా స్పందించాడు.

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ పర్యటన కోసం ప్రకటించిన వన్డే జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా స్పందించాడు. యశస్వికి సెలెక్టర్లు అన్యాయం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా పరుగులు సాధిస్తున్న ప్లేయర్‌కు తగినన్ని అవకాశాలు కల్పించలేకపోతే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.


‘వన్డే సిరీస్‌కు బీసీసీఐ రెండు టీమ్‌లను ప్రకటించింది. ఆఖరి రెండు వన్డేలకు శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే ఆ స్థానంలో యశస్వి జైస్వాల్‌కు కచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాలి. కానీ కివీస్ పర్యటనలో యశస్వి చోటు దక్కకపోవడం నిజంగా అన్యాయం. ఇలాగే కొనసాగితే ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇటీవల అతడు సాధించిన పరుగులను చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. జైస్వాల్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించడం లేదు. కేవలం అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. ఒకప్పుడు జైస్వాల్ పరుగుల యంత్రంలా ఉండేవాడు. అలాంటి ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంటే, సాధ్యమైనంతవరకు అవకాశాలు కల్పించడం టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల బాధ్యత. కానీ అతడికి అలాంటి అవకాశాలు రావడం లేదు.


గత రెండేళ్లలో జైస్వాల్ బ్యాటింగ్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. అతడు తిరిగి తనదైన లయను అందుకోవాలంటే తగినంత మ్యాచ్ సమయం, జట్టు మద్దతు అవసరం. జైస్వాల్ టెస్టు క్రికెట్ కోసం సిద్ధం కావాలన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. కానీ అతడు చివరిసారిగా ఎప్పుడు వన్డే ఆడాడు? టీ20 ఎప్పుడు ఆడాడు? టెస్టు మ్యాచ్ ఎప్పుడు ఆడాడు? శ్రీలంకతో ఆడిన టెస్టే అతడికి చివరిది. నేనే సెలెక్షన్ కమిటీలో ఉండి ఉంటే.. రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంది. ఆడుతావా? అని అడిగేవాడిని. అంతర్జాతీయ మ్యాచుల్లో ప్రాతినిధ్యం కంటే మించింది ఇంకేం ఉంటుంది’ అని అశ్విన్ వివరించాడు.


ఇవీ చదవండి:

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

‘నా కూతురిని నేనే చంపేశా’.. 911కు తల్లి ఫోన్‌ కాల్

Updated Date - Oct 17 , 2026 | 02:36 PM