Share News

భువీ అధ్యాయం ముగిసినట్లే.. షమీకి మరో ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్

ABN , Publish Date - Nov 03 , 2026 | 09:34 AM

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో భువనేశ్వర్ ప్రదర్శన నిరాశపరిచిందని, ఇకపై అతడికి భారత జట్టులో మరో అవకాశం రావడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

భువీ అధ్యాయం ముగిసినట్లే.. షమీకి మరో ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ న్యూజిలాండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడి కెరీర్‌పై చర్చలు మొదలయ్యాయి. ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో భువనేశ్వర్ ప్రదర్శన నిరాశపరిచిందని, ఇకపై అతడికి భారత జట్టులో మరో అవకాశం రావడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి తిరిగి జట్టులో చోటు కల్పించాలని సూచించాడు.


‘భువనేశ్వర్ కుమార్ ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. తన ఫామ్‌ను నిరూపించుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌కు, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బౌలింగ్‌కు మధ్య చాలా తేడా ఉంది. నా అభిప్రాయం ప్రకారం అతడి అధ్యాయం ఇక ముగిసినట్టే. అతడికి తిరిగి జట్టులోకి తీసుకోవాలంటే మేనేజ్‌మెంట్ కూడా ఆలోచిస్తుంది. ఐపీఎల్‌లో భువీ బౌలింగ్ చేసే సమయంలో ఉండే రన్‌అప్ వేగం, బౌలింగ్ స్పీడ్ ఇక్కడ కనిపించలేదు. ఈ సిరీస్‌కు ముందు అతడు తన అత్యుత్తమ ఫిట్‌నెస్, శిక్షణ స్థాయితో సిద్ధమయ్యాడా? అనే సందేహం కలుగుతోంది. కొత్తగా వచ్చిన యువ ఆటగాడికి పది అవకాశాలు ఇవ్వొచ్చు. కానీ ఇప్పటికే ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు తిరిగి వచ్చినప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది’ అని అశ్విన్ వివరించాడు.


షమీకి అవకాశం ఇవ్వాలి..

ఇదే సమయంలో మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి టీమిండియాలో తిరిగి అవకాశం ఇవ్వాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘ఏడాదిన్నర కాలానికి పైగా భారత జట్టుకు దూరంగా ఉన్న షమీ.. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. షమీ బౌలింగ్‌లో మంచి లయ కనిపిస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో భువనేశ్వర్ కంటే అతడే మెరుగైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తోంది’ అని అశ్విన్ వివరించాడు. భారత జట్టు డిసెంబర్‌లో స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై

తీరం దాటిన మురసు తుఫాన్.. 110కి.మీ వేగంతో ఈదురుగాలులు!

Updated Date - Nov 03 , 2026 | 09:34 AM